MHBD: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాద్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని ఎస్టీయూ టీఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు గన్నోజు ప్రసాద్ డిమాండ్ చేశారు. శుక్రవారం తొర్రురు హై స్కూల్ లో ఎస్టీయూ టీఎస్ రెండవ కార్యవర్గ సమావేశం జరుగగా ఆయన పాల్గొని మాట్లాడారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి ఎస్టీయూ టీఎస్ సంఘం అలుపెరుగని పోరాటాలు చేస్తుందని గుర్తుచేశారు.