దేశవ్యాప్తంగా ఈ నెల 3న జరిగిన నీట్-యూజీ వైద్య ప్రవేశ పరీక్షలో పేపర్ లీక్ కావడంతో ఆ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే రద్దు చేసిన ఆ పరీక్షను జూన్ 21న నిర్వహించనుంది. ఈ నీట్ పునఃపరీక్షను 100 శాతం పక్కాగా, ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించడానికి ప్రభుత్వం అన్నిరకాల కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు.