కడప జిల్లాలో అకాల వర్షాలు,బలమైన గాలుల కారణంగా అరటి, నిమ్మ, మామిడి, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సీకే దిన్నె(M) కొలుములపల్లిలో దెబ్బతిన్న అరటి తోటలను CPM కార్యదర్శి చంద్రశేఖర్ శుక్రవారం పరిశీలించారు. చేతికొచ్చిన పంట నేలపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి,ఎకరాకు రూ.50 వేలు పరిహారం అందించాలని కోరారు.