KNR: అభ్యున్నతికి విశేషంగా కృషిన గొప్ప సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ అని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా కొనియాడారు. ఎం. భాగ్యరెడ్డి వర్మ 138వ జయంతి వేడుకలను శుక్రవారం కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతికి, దళిత మహిళల విద్యకు, ప్రగతికి చేసిన కృషిని గుర్తు చేశారు.