ASR: అరకులోయ మండలం దేవరాపల్లి గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు శుక్రవారం డిమాండ్ చేశారు. పంచాయతీ నిధులు రూ. 2.20 లక్షలతో మరమ్మతులు చేసిన నాణ్యత లోపించి చుక్కనీరు రాక తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడిందన్నారు. దీంతో గ్రామస్తులు ప్రతి కుటుంబం నుంచి రూ.500 చందాలు వేసుకుని తమ సొంత నిధులతో కొళాయి మరమ్మతు చేసుకున్నట్లు తెలిపారు.