కడపలో TDPకి మళ్లీ పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యమని MLA మాధవి రెడ్డి అన్నారు. యువగళం పాదయాత్రతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని తెలిపారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పసుపు జెండా ఎగరేసి మంత్రి లోకేశ్‌కు కానుకగా ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా ఇక్కడ TDP గెలవలేదని, క్యాడర్లో నైరాశ్యం నెలకొన్న సమయంలో తాను బాధ్యతల తీసుకున్నానన్నారు.