CTR: చిన్నతనం నుంచే పొదుపు అలవర్చుకోవాలని ICDS పులిచర్ల ప్రాజెక్టు CDPO వాణి శ్రీదేవి అన్నారు. రొంపిచర్ల మండలం మోటుమల్లెల సచివాలయంలో కిషోర్ వికాసం వేసవి శిక్షణ కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించారు. చిన్నతనంలో పొదుపు భవిష్యత్తులో ఆర్థిక అవసరాలకు ఉపయోగపడుతుందన్నారు. డబ్బును వృథాగా ఖర్చు పెట్టకుండా ప్రణాళిక ప్రకారం ఖర్చు చేయాలన్నారు.