VSP: నగరంలోని డాబాగార్డెన్స్ ప్రాంతంలో వీఎఫ్జే సమీపంలో ఇవాళ సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడినట్లు సమాచారం. ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.