VZM: పబ్లిక్ టాయిలెట్లను బాగుచేసి వినియోగంలోకి తేవాలని బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి ఆదేశించారు. శుక్రవారం స్థానిక కోరాడవీధి, యాతవీధి, నాయుడుకాలనీ, నాగాశపువీధిలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా కోరాడవీధి స్మశానవాటిక, యాతవీధి దగ్గర ఉన్న టాయిలెట్లను బాగు చేయాలని సూచించారు. అలాగే రన్నింగ్ వాటర్ అందుబాటులోకి తేవాలన్నారు.