NDL: కొలిమిగుండ్ల మండలం బందార్ల పల్లె గ్రామ సమీపంలో ఉన్న గని గుంతలో ఇవాళ చాకలి ఆంజనేయులు అనే వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆంజనేయులు బట్టలు ఉతికే డ్రమ్మును ఎత్తుకొని వెళ్తుండగా కాలుజారి విద్యుత్ వైరుపై పడ్డాడు. అదే సమయంలో ఆంజనేయులుకు విద్యుత్ షాక్ తగలడంతో మృత్యువాత పడ్డాడు.