కేంద్ర ప్రభుత్వానికి RBI గుడ్న్యూస్ చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.2.87 లక్షల కోట్లు డివిడెండ్ రూపంలో చెల్లించనున్నట్లు ప్రకటించింది. RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో RBI సెంట్రల్ బోర్డు డైరెక్టర్లు నిర్వహించిన సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు RBI తెలిపింది.