SRCL: ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక” 99 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా 18-03-2026 నుంచి 23-05-2026 వరకు యువజన, క్రీడా వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో సర్వ్ & సపోర్ట్ – యూత్ ఫర్ క్లీన్ తెలంగాణా కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఉదయం 6.30 నుంచి 8.30 వరకు నాంపల్లి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, వేములవాడ హరిత హోటల్ పరిసరాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు.