TG: రాష్ట్రంలో తొలి గాజు వంతెన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సిద్ధమవుతోంది. కాకతీయుల కాలం నాటి స్థానిక ఎల్లమ్మ చెరువు సుందరీకరణలో భాగంగా 5 అడుగుల వెడల్పు, 150 మీటర్ల పొడవుతో హృదయాకారంలో దీన్ని రూపొందిస్తున్నారు. రూ.4.22 కోట్లతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జిని మరో నెల రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది.