ADB: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ ద్వారానే గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు. శుక్రవారం పట్టణంలోని STU భవన్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక వసతుల మెరుగుదలపై దృష్టి పెట్టాలని దిశా నిర్దేశం చేశారు.