KRNL: ఆదోనిలో రాయలసీమ మిల్లు కార్మికులతో ఇవాళ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సమావేశమయ్యారు. కార్మికుల బకాయిల చెల్లింపులో ఆయన చేసిన కృషిని కార్మికులు, ఐఎస్టీయూ నాయకులు అభినందించారు. కార్మికులకు సంబంధించిన సుమారు రూ.1.70 కోట్ల బకాయిలను రెండు దఫాల్లో చెల్లించనున్నట్లు తెలిపారు. మొదటి దఫాలో రూ.84 లక్షలు కార్మికుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు.