TG: తెలుగు యాంకర్ విష్ణుప్రియకు సోషల్ మీడియాలో వేధింపులు ఎదురవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా ఇన్స్టాగ్రామ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో తనపై జరుగుతున్న ట్రోలింగ్, వ్యక్తిత్వ హననానికి సంబంధించిన వివరాలను విష్ణుప్రియ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆమె HYD మియాపూర్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.