PLD: మాచర్ల మున్సిపాలిటీ పరిధిలోని కేసీపీ గెస్ట్ హౌస్ ఎదుట ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా తోపుడు బండ్లు నిర్వహించే వ్యాపారులు, స్ట్రీట్ వెండర్స్, రైతు బజారుల కోసం ఆ స్థలాలను కేటాయించేలా సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.