ATP: భారీ వర్షాల నేపథ్యంలో అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్పర్సన్ బల్లా పల్లవి శుక్రవారం యార్డ్‌ను పరిశీలించారు. రేపు జరగనున్న సంత దృష్ట్యా అక్కడ నీరు నిల్వ ఉండటాన్ని గమనించారు. రైతులు, వ్యాపారులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తక్షణమే మట్టిని తొలగించే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పశువుల సంత కోసం కవర్ షెడ్ గేట్లు తెరిచి ఉంచాలని సూచించారు.