NGKL: కల్వకుర్తి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంను ఈరోజు మున్సిపల్ ఛైర్మన్ బృంగి రత్నమాల ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో ఎంత మంది రెగ్యులర్, ఔట్సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్నారని హాజరు పట్టికను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. మున్సిపల్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు.