మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామంలోని గిద్దలూరు-బద్వేల్ ప్రధాన రహదారిపై గత రాత్రి కురిసిన వర్షానికి నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుపై నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.