CTR: పుంగనూరు పురపాలక పరిధిలో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కమిషనర్ మధుసూదన్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమం జూన్ 20వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ నాలుగు దశలో అమలు చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రధాన రహదారులు మొదలు ప్రజా మరుగుదొడ్లు వరకు శుభ్రత చేపట్టడం జరుగుతుందన్నారు.