SRPT: కోదాడ పట్టణానికి చెందిన బసనబోయిన పున్నయ్యకు చెందిన మూడు నెలల కోడిపిల్ల ప్రమాదవశాత్తు గేదె తొక్కడంతో తీవ్రంగా గాయపడింది. తొడ ఎముక విరగడంతో వెంటనే కోదాడ పశు వైద్యశాలకు తీసుకువచ్చారు. కోడిపిల్లను పరిశీలించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా. పీ.పెంటయ్య విరిగిన కాలికి ప్రత్యేక చికిత్స అందించి రెండు రాడ్లు అమర్చారు.