WGL: క్రికెట్ అభిమానులను అలరించేందుకు వరంగల్ జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 23, 24 తేదీల్లో CKM కళాశాల మైదానంలో IPL ఫ్యాన్ పార్క్ నిర్వహించనున్నారు. శుక్రవారం WGL ప్రెస్ క్లబ్లో నిర్వాహకులు మాట్లాడుతూ.. భారీ LED తెరలపై IPL మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. క్రీడా అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావాలని నిర్వాహకులు కోరారు.