TG: జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన TG బిడ్డల ఓటు హక్కును కాపాడేందుకు పార్టీ తరఫున ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు మాజీ మంత్రి KTR తెలిపారు. సర్ కార్యక్రమానికి సంబంధించిన విషయంలో లక్షలాది మంది తెలంగాణ NRIల నుంచి ఆందోళన వ్యక్తమవుతుందని చెప్పారు. ఈ విషయంలో గల్ఫ్ బాట పట్టిన వారి ఓటు హక్కు తొలగించవద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని పార్టీ తరఫున కలుస్తామని పేర్కొన్నారు.