NLG: చిట్యాల పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపు విజయవంతంగా కొనసాగుతోంది. సుమారు 40 మంది విద్యార్థులు యోగా, డ్యాన్స్, కంప్యూటర్ వంటి అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారని, ఈ శిక్షణా తరగతులు ఈ నెల 25తో ముగుస్తాయని యోగా ఇన్స్ట్రక్టర్ వంగూరి శేఖర్ తెలిపారు.