HYDలోని పంజా గుట్ట NIMS వైద్య రంగంలో మరో మైలురాయి చేరుకుంది. ఒకే ప్రభుత్వ ఆస్పత్రిలో 2 వేల కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి చేసి ప్రత్యేక గుర్తింపు పొందింది. పేద, మధ్య తరగతి రోగులకు ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా ఉచిత వైద్యం అందిస్తూ నిమ్స్ ఆశాకిరణంగా నిలుస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.