WG: డబ్బు సంపాదన ఒక సాధనం మాత్రమేనని, అది లక్ష్యం కాదని ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎం. సుజాత అన్నారు. కిశోర వికాసం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పెంటపాడు సచివాలయం-2 పరిధి అంగన్వాడీ కేంద్రంలో ఆర్థిక నిర్వహణపై బాలికలకు అవగాహన కల్పించారు. బాలికలు ఆర్థికపరమైన అంశాలపై పరిజ్ఞానం పెంచుకోవాలని, అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలన్నారు.