PDPL: భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు శుక్రవారం ఐడీఓసీలో ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భాగ్యరెడ్డి వర్మ దళిత జనోద్దరణ, సమ సమాజ నిర్మాణానికి చేసిన సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. మహనీయుల ఆశయాలను కొనసాగించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.