KDP: ఎర్రగుంట్లలో శుక్రవారం ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరుతో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శేషఫణి ఆధ్వర్యంలో పట్టణంలోని ముఖ్య రోడ్లను శుభ్రం చేశారు. పేరుకుపోయిన చెత్తాచెదారాలను కార్మికులతో కలిసి కమిషనర్ స్వయంగా తొలగించారు. ఈ పారిశుద్ధ్య కార్యక్రమంలో పలువురు ఎన్డీఏ నాయకులు సైతం పాల్గొని వీధులను శుభ్రపరిచారు.