గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల గ్రామ శివారులో పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని, మూడు సెల్ఫోన్లు, రూ.7,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో ఆరుగురు పరారైనట్లు పోలీసులు తెలిపారు. కేసు తదుపరి విచారణ కోసం తాడికొండ పోలీసులకు అప్పగించారు.