PLD: ఏపీ ఫిల్మ్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ ఎఫ్డీసీ) కొత్త కమిటీలో చిలకలూరిపేట పరిసర ప్రాంతాలకు చెందిన ముగ్గురికి డైరెక్టర్లుగా అవకాశం దక్కింది. డాక్టర్ కందిమళ్ళ సాయిశివరావు, నాదెండ్లకు చెందిన నటుడు శివాజీ శొంఠినేని, యడ్లపాడు మండలం బోయపాలేనికి చెందిన దర్శకుడు వీ.సముద్ర ఈ పదవులకు ఎంపికయ్యారు.