కురుపాం మండల కేంద్రంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని ట్రైబల్ రైట్స్ ఫోరం (TRF) డిమాండ్ చేసింది. పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన ప్రాంత ప్రజలు రక్తం కోసం విజయనగరం, శ్రీకాకుళం వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. కురుపాం ఆసుపత్రి ఆవరణలో ఐటీడీఏ నిధులతో బ్లడ్ బ్యాంక్, బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరింది.