NLR: ఉదయగిరి మండలం పుల్లాయపల్లిలో రిలయన్స్ CBG ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నారు. సంబంధిత స్థలాన్ని MLA కాకర్ల సురేశ్ పరిశీలించారు. గ్రామ ప్రజల అభ్యంతరాలు, సూచనలు తెలుసుకుని అధికారులతో చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం కరువు పనుల్లో పాల్గొన్న మహిళలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.