ఏలూరు 19వ డివిజన్ ప్రజా సమస్యలను పరిష్కరించాలంటూ శుక్రవారం నగరవాసులు ఎమ్మెల్యే బడేటి చంటికి వినతి పత్రం సమర్పించారు. నిలిచిపోయిన పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణం పూర్తి చేసి వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని, మిగిలిపోయిన రోడ్లు, 300 మీటర్ల మంచినీటి పైపైన్ నిర్మించాలని, వీధిలైట్లు వేయించాలని వారు కోరారు.