మలయాళ అగ్ర హీరోలు మమ్ముట్టి, మోహన్‌లాల్ కలయికలో వచ్చిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘పేట్రియాట్’. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ పొలిటికల్ స్పై థ్రిల్లర్.. ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ‘జీ 5’లో జూన్ 5 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఒకేసారి అందుబాటులోకి రానుంది.