KDP: RGUKT 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకోసం ఆసక్తి గల విద్యార్థులు SSC రీవెరిఫికేషన్, రీవాల్యుయేషన్ ఫలితాలకోసం వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కన్వినర్ అమరేంద్ర కుమార్ సాండ్రా సూచించారు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ మే 30అని తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా నిర్ణీత గడువులోపు తమ దరఖాస్తులను సమర్పించాలని కోరారు.