HYD: సనత్నగర్ IDH కాలనీలో రూ.41 లక్షలతో నిర్మించనున్న చిన్నారుల ప్లే పార్క్ పనులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం ఆయన కాలనీలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. వారి సమస్యలను, సదుపాయాలపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. రూ.41 లక్షలతో పార్క్ అభివృద్ధి కానుండటంతో స్థానిక చిన్న పిల్లలు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.