అన్నమయ్య: గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు అందించాలని గిరిజన విద్యార్థి సంఘం నాయకులు శుక్రవారం మదనపల్లెలో ర్యాలీ చేపట్టారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్ నాయక్, నాయకులు అమరేంద్ర నాయక్, రఘు నాయక్ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన తండాలలోని లంబాడీలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని చెప్పారు.