NGKL: కొల్లాపూర్ మండలం రామాపురం పంచాయతీ కార్యదర్శి పవన్‌కుమార్ శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి బైక్‌పై వెళ్తుండగా కల్వకోలు- చెన్నపురంపల్లి మధ్య ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో 108లో జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.