IPLలో బీహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌ల నేపథ్యంలో, వేదాంత గ్రూప్ బిలియనీర్ అనిల్ అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.”చెన్నై, ముంబై తరహాలోనే బీహార్‌కు కూడా సొంత ఐపీఎల్ జట్టు ఉండాలి” అని ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వంటి ప్రతిభావంతులు బిహార్ సొంత జట్టులో ఆడితే అది ప్రపంచంలోనే అత్యుత్తమ టీమ్‌గా ఎదుగుతుందన్నారు.