NTR: ఇబ్రహీంపట్నం ఖాజీమాన్యంలో చెత్తతో నిండిన కాలువపై వచ్చిన వార్తకు మున్సిపల్ అధికారులు స్పందించారు. శుక్రవారం ఉదయం యంత్రాలతో కాలువలో చెత్తను తొలగించే పనులు చేపట్టారు. పూర్తిగా శుభ్రం చేస్తామని, భూగర్భ కాలువకు ప్రతిపాదనలు పంపుతామని అధికారులు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.