ATP: మిడ్ పెన్నార్ సౌత్ కెనాల్ మరమ్మతులకు సీఎం చంద్రబాబు రూ.8.5 కోట్లు కేటాయించడంపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అనంతపురం హెచ్ఎల్సీ కార్యాలయంలో ఎస్సీ సుధాకర్ రావును రైతులతో కలిసి కలిశారు. ఈ పనులను ఐఎస్వో ప్రమాణాలతో నాణ్యతగా నిర్వహించాలని కోరారు. నాసిరకంగా పనులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.