AP: పింఛన్లపై మాజీ సీఎం జగన్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. 6 లక్షల పింఛన్లు తొలగించామని పచ్చి అబద్దం చెప్పారని మండిపడ్డారు. చనిపోయినవారి పింఛన్లు మాత్రమే తొలగించామని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వంలో 11 లక్షల మంది పింఛన్లు తొలగించారని ఆరోపించారు. జగన్ అబద్ధపు ప్రచారాలను రాష్ట్ర ప్రజలు ఎవరూ నమ్మవద్దని పేర్కొన్నారు.