VZM: సమతుల పోషకాలు మొక్కకు అందేలా ఎరువులు వాడాలని జిల్లా వ్యవసాయ అధికారి వీ.టీ.రామారావు అన్నారు. శుక్రవారం గజపతినగరం మండలంలోని తుమ్మికాపల్లి రైతు సేవా కేంద్రంలో అవగాహన సదస్సు జరిగింది. నవధాన్యాలు, పచ్చిరొట్ట విత్తనాలు వేసుకొని కలియ దున్నడం వలన సేంద్రీయ కార్బన్ శాతం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏడిఎ శ్రీనివాస్, ఏవో కిరణ్ కుమార్ పాల్గొన్నారు.