KDP: ముద్దనూరు మండలం పెనికిలపాడు గ్రామంలోని పొలాల్లో సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ ఉద్యాన పంటలను రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా దాదాపు గంటసేపు రైతుతో ముఖాముఖి మాట్లాడి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, సాగు విధానాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయ ప్రయోజనాలు,అధిక దిగుబడులు సాధించే విధానాలపై ఆసక్తిగా చర్చించారు.