AKP: ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే చర్యలు తీసుకుంటామని కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ హెచ్చరించారు. ఎటువంటి లైసెన్స్ లేకుండా స్క్రాప్ కొనుగోలు చేస్తున్న వ్యాపారిని శుక్రవారం కోటవురట్లలో అధికారులు అడ్డుకున్నారు. లైసెన్స్ చూపించాలని నిలదీగా లైసెన్స్ లేదని వ్యాపారి చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. లైసెన్స్ తీసుకున్న తర్వాతే వ్యాపారం చేయాలన్నారు.