సత్యసాయి: లేపాక్షి ఇందిరమ్మ కాలనీలో వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాలనీ ఏర్పడి 20 ఏళ్లు అయినా డ్రైనేజీ సౌకర్యం కల్పించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లపై నీరు నిలవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.