TPT: చిన్నగొట్టిగల్లు (M) పాలమాకులపల్లి అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దుండగులు సదరు వ్యక్తి గొంతు, మర్మాంగం కోసి కిరాతకంగా హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో కత్తి, క్యారియర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజుల క్రితమే ఈ ఘోరం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు, ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.