NLG: కేతేపల్లి మండలం బొప్పారానికి చెందిన దుర్గం వెంకన్న చిన్నప్పటి నుంచి వికలాంగత్వం వల్ల అనేక కష్టాలు అనుభవించారు. అయినప్పటికీ నిరాశ చెందకుండా పట్టుదలతో చదివాడు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొ. సూర్య ధనుంజయ పర్యవేక్షణలో ‘అందె వెంకటరాజు సాహిత్యం సమగ్ర పరిశీలన’ అనే అంశంపై పరిశోధన పూర్తి చేసి డాక్టరేట్ సాధించాడు.