KDP: చెన్నూరు గ్రామ శివారులోని శ్రీ శ్యామలా మాతంగి దేవి ఆలయంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుంచే అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు కన్నుల పండువగా జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఆలయంలో అమ్మవారికి 51 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.